మహిళల ప్రాతినిధ్యం పెరిగితే అభివృద్ధి సాధ్యం
ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): మహిళల ప్రతినిధ్యం పెరిగితే అ భివృద్ధి సాధ్యమని ఎంపీ డీకే అరుణ అన్నా రు. మంగళవారం నారీ శక్తి వందన్ అధిని యం (చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్) బిల్లుకు మద్దతుగా మహబూబ్ నగర్ పట్టణం కేంద్రంలోని ఎంపీ డీకే అరు ణ పాదయాత్రగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ చౌరస్తా లో మహి ళలతో కలసి ఎంపీ డీకే అరుణ. బతుకమ్మ ఆడారు.
ఈ సందర్బంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ 2029 సార్వతిక ఎన్నికల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజ ర్వేషన్ అమలు చేయాలని చట్టం చేయబో తున్నారన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావే శాలలో ప్రతి ఒక్క పార్టీ సభ్యులు పాల్గొని ఈ బిల్లుకు మద్దతుగా నిలవాలని వారిని విజ్ఞప్తి చేస్తున్నాని పేర్కొన్నారు. లింగ వివక్షత ఉండవద్దు.. మహిళలు రాజకీయాల్లో రా ణించే శక్తి.. పాలించే శక్తి మహిళలకు ఉం దన్నారు.
ఝాన్సీ లక్ష్మీ బాయి,రాణి రుద్రమ దేవి పోరాట పటిమ చూపిన వీర వనితలు ఉన్నారని పేర్కొన్నారు నారీ శక్తి కి బాధ్యత ఇస్తేనే వికాసిత్ భారత్ లక్ష్యం నెరవేరు తుందని తెలిపారు.భారతదేశ పరిపాలనలో మహిళల భాగస్వామ్యం ఇవ్వాలని, మహి ళలు రాజకీయాల్లోకి వస్తె..తమ కుర్చీలు, ప్రాధాన్యత పోతుందని మహిళా బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేసి.. గతంలో వ్యతి రేకించారని, 2029లో మహిళా రిజర్వేషన్ 33శాతం అమలు చేయాలని ప్రధాని నరేం ద్ర మోదీ కంకణం కట్టుకొని పని చేస్తు న్నారన్నారు.
మహిళా బిల్లుకు మద్దతు తెలుపుతూ 966 717 3333 నంబర్ కి మి స్డ్ కాల్ ఇవ్వాలని, తెలంగాణలో 60 నూ తన అసెంబ్లీ స్థానాలు పెరిగితే.. 60 మంది మహిళాలు ఎమ్మెల్యేలు అవుతారన్నారు. అసెంబ్లీ,పార్లమెంట్ లలో మహిళల ప్రతిని ధ్యం పెరిగితే.. మహిళల అభివృద్ధి,రక్షణ, మహిళా సమస్యలపై గొంతు విప్పి అవకా శం వస్తుందని,అవినీతి రహిత పాలన మహి ళతోనే సాధ్యం అవుతుందన్నారు. అన్ని రంగాలలో మహిళలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ, ఆర్థికంగా బలోపేతం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.






