09-02-2026 01:50:48 AM
మెట్ పల్లి, ఫిబ్రవరి8(విజయక్రాంతి):మెట్ పల్లి పట్టణ 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మైలారపు లింబాద్రి కి మద్దతుగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు వరంగల్ మేయర్ గుండు సుధరాణి కలిసి ఆదివారం వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
గత పది సంవత్సరాల టిఆర్‌ఎస్ పాలనలో పేద మధ్యతరగతి ప్రజల కు చేసింది ఏమీ లేదని, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు, నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడమే కాకుండా పేదలు కడుపునిండా అన్నం తినాలనే సంకల్పంతో రేషన్ దుకాణాల ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రైతు, రుణమాఫీ వంటి కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల ఊబిలోకి లాగినా కూడా సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.వార్డులు అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తేనే మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు.