ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం
ఆయుష్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జుట్టు ఉత్తరయ్య
మహబూబ్ నగర్ అర్బన్ జూలై 12 : ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయుష్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జుట్టు ఉత్తరయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయుష్ నూతన ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా జన్ను వెంకటస్వామి గౌరవాధ్యక్షులుగా డి శశిధర్, ఉపాధ్యాయులుగా డి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె బ్రహ్మానందం, కోశాధికారిగా దశరథం కార్యవర్గ సభ్యులుగా పుష్పలత, రుక్మిదేవి, వెంకటేశ్వర్లు, గోపాల్ గౌడ్, సురేందర్ ఎన్నుకోవడం జరిగిందన్నారు. బాధ్యతలు తీసుకోవడంతో పాటు అందరిని కలుపుకుపోయి సమర్థవంతంగా కార్యవర్గాన్ని ముందుకు తీసుకుపోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు ఉన్నారు.






