కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
మునిపల్లి, ఆగస్టు 31 : అభివృద్ధి అంటే కాంగ్రెస్ కే సాధ్యమని రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్, మాజీ ఎంపీటీసీ పాండు లు అన్నారు. ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లలో మండలంలో ఇప్పటి వరకు 70 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు మంత్రి దామోదర రాజనర్సింహ శంకుస్థాపన చేసి ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పనులను త్వరలోనే ప్రారంభించినట్టు వారు తెలిపారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగడం లేదని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపణలు చేయడం సరికాదని వారు అన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ సహకారంతో మండలం అభివృద్ధి లో ముందుకు సాగుతుందని అన్నా రు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వెంకట్ రాములు, మక్సు ద్, రుద్రకృష్ణ, ర హీం, శంకరయ్య, సంగన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు.






