కారును ఢీకొట్టిన లారీ : ఇద్దరు మృతి
జహీరాబాద్, ఆగస్టు 31 : కారును అతివేగంగా వచ్చిన లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందిన సంఘటన జహీరాబా ద్ పట్టణంలో ఆదివారం జరిగింది. జహీరాబాద్ ఎస్‌ఐ వినయ్కుమార్ తెలిపిన వివ రాల ప్రకారం..జహీరాబాద్ నుండి రేజింతల్ శ్రీ సిద్ధి వినాయక దర్శనానికి వెళ్తున్న మారుతీ 800 కారును స్థానిక రైల్వే ట్రాక్ దాటిన తర్వాత బీదర్ వైపు నుంచి వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది.
దీంతో కారులో 8 మంది ప్రయాణిస్తుండగా వారి లో ఇద్దరు మరణించగా మిగతా వారిని జ హీరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికి త్స నిమిత్తం తరలించినట్లు ఆయన తెలిపా రు. దండు వెంకటేశం, ఆయన అల్లుడు సా యికుమార్లకు తీవ్ర గాయాలు కావడంతో జహీరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు ఎస్త్స్ర తెలి పారు.
లారీని అతివేగంగా అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే జహీరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం, ఎస్త్స్ర వినయ్ కుమార్ సిబ్బందితో వెళ్లి కారులో చిక్కుకున్న డ్రైవర్ను తీశారు.






