3 September, 2026 | 11:30 AM

ఆసక్తిగా ‘బీసీ రిజర్వేషన్లు’

01-09-2025 | 12:00am

-  స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు రాజకీయ కసరత్తులు

- సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ పీఠాలపై బీసీ ఆశావహుల దృష్టి

సిద్దిపేట ఆగస్టు 31 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై ఆధారపడి కొత్త రాజకీయ సమీకరణాలకు వేదిక కానున్నా యి. గ్రామాల నుంచి జిల్లా వరకు బీసీల ఆశలు రిజర్వేషన్లపై బలంగా నిలబడడంతో, రాబోయే ఎన్నికలలో వారి పాత్ర ఎంత కీలకం అవుతుందో అన్నది రాబోయే రోజు ల్లో స్పష్టమవనుంది. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త రాజకీయ వేడి వాతావరణాన్ని సృష్టించా యి.

ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనున్న ఎ న్నికల నోటిఫికేషన్తో పాటు గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల రిజర్వేష న్ జాబితా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం సంకేతాలు ఇవ్వడంతో, గ్రామాల్లో బీసీ వ ర్గాల మధ్య ఉత్కంఠ మరింత పెరిగింది. ఏ గ్రామం బీసీ రిజర్వేషన్ కిందకు వస్తుందో అన్నదే ఇప్పుడు ప్రతిచోటా చర్చనీయాంశమైంది.

గ్రామాల్లో బీసీ నేతలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన శ్రేణులు తమ ఊహాగానాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. కొంత మంది బీసీ నాయకులు మా గ్రామం రిజర్వ్ అయితే నేను సర్పంచ్ తప్పక అవుతానని ధీమాగా ప్రచారం మొదలుపెట్టగా, మరికొంతమంది వ్యూహాత్మకంగా మద్దతుదారులను సమీకరించడంపై దృష్టి పెట్టారు. మహిళా సంఘాలు, యువజన సంఘాలు, కుల సం ఘాలను ప్రభావితం చేస్తూ తమకు అనుకూల వాతావరణం సృష్టించుకునే ప్రయ త్నాలు చేస్తున్నారు.

ఎత్తుగడలు, మైత్రి యత్నాలు

స్థానికంగా ఎవరు బలమైన అభ్యర్థి అన్న దానికంటే, రిజర్వేషన్ ఏ వర్గానికి దక్కుతుందనే దానిపైనే ప్రధానంగా గమనిక ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది బీసీ ఆశావహు లు గ్రామంలోని ప్రధాన ఓటర్లను ఆకర్షించడానికి విందులు, సామూహిక సమావేశా లు, చిన్న చిన్న సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పార్టీల ఆధ్వర్యంలో నూ మైత్రి రాజకీయాలు, గ్రూపుల ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొంతమంది నేతలు ఇత ర కులాల నాయకులతో సయోధ్యకు కూడా ప్రయత్నిస్తున్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థాయిలో బలమైన పోటీ

గ్రామపంచాయతీలతో పాటు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు కూడా బీసీ రిజర్వే షన్లోకి వస్తాయానే ఉత్కంఠతో పాటు బలమైన పోటీ నెలకొంది. మండల, జిల్లా స్థా యి రాజకీయాల్లో బీసీలకు మరింత ప్రాధా న్యం లభించబోతుందన్న ఆశతో, ఇప్పటికే కొందరు పోటీదారులు పరోక్ష ప్రచారం ప్రారంభించారు. రిజర్వేషన్ అనుకూలంగా వస్తే, బీసీ వర్గాల నుంచి కొత్త నాయకత్వం ఎదగడం ఖాయమని తెలుస్తుంది.

ఓటర్ల ఆకర్షణకు పోటీ

గ్రామాల్లో ఎన్నికల మూడ్ మొదలైన వెంటనే ప్రచార పద్ధతులు కూడా మారా యి. ఓటర్లను ఆకర్షించడానికి ప్రతి ఇంటికి వెళ్లి మాట్లాడటం, కుల సభలు పెట్టడం, మహిళా స్వయం సహాయక సంఘాలకు వా గ్దానాలు ఇవ్వడం వంటి ఎత్తుగడలు ఉపయోగిస్తున్నారు. మరికొన్ని చోట్ల సోషల్ మీడియా వేదికగా యువతను టార్గెట్ చేస్తున్నారు.

ప్రజల్లో చర్చనీయాంశం

సాధారణ ప్రజల్లో కూడా ఇప్పుడు ప్రధాన చర్చ మన గ్రామం బీసీ రిజర్వ్ అవుతుందా? లేక వేరే వర్గం రిజర్వ్ అవుతుం దా? అన్నదే. దీంతో ప్రతి వర్గం తమకు అనుకూలంగా రిజర్వేషన్ రావాలని ఆశపడుతోంది. ఒకవైపు ప్రజాస్వామ్య ఉత్సవానికి సన్నాహాలు మొదలవుతుంటే, మరోవైపు రిజర్వేషన్ల రాజకీయ సమీకరణలు గ్రామా ల్లో కొత్త చర్చలకు దారి తీస్తున్నాయి.