calender_icon.png 8 December, 2025 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోలీపూర్ అభివృద్ధే ఎజెండా

08-12-2025 12:21:53 AM

  1. ఉత్తమ గ్రామ పంచాయతీగా సోలిపూర్‌ను రాష్ట్ర స్థాయిలో నిలిపాం..

గడిచిన 5 ఏండ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు ప్రజల కండ్ల ముందు..

గతంలో 236 మందికి సొంత జాగాలో ’డబుల్’ ఇండ్ల  నిర్మాణం

వనపర్తి, డిసెంబర్ 7 ( విజయక్రాంతి ) : ’దేశానికి పల్లెలే పట్టుగొ మ్మలు’ అని గాంధీజీ చెప్పిన మాటలకు నిదర్శనంగా సోలిపూర్ గ్రామ అభివృద్దే తన ఎజెండా అని సర్పంచ్ అభ్యర్థి పద్మశ్రీ బాలీశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా, సమస్య లు లేని గ్రామం గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం తో ప్రజల ముందుకు వెళుతున్న నేపథ్యంలో గ్రామం లో అడుగుడుగునా ప్రజలు సర్పంచ్ అభ్యర్థి పద్మశ్రీ బాలీశ్వర్ రెడ్డి కి నీరాజనం పలుకుతున్నారు.

తాజా మాజీ సర్పంచ్ గా సోలిపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయి లో అవార్డు లను సాధించి రాష్ట్ర చూపు సైతం గ్రామం వైపు చూసేలా చేయడం జరిగిందని ప్రజలు బహటంగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ పథకం ఏదియినా సరే అందుకు అర్హులు అయితే చాలు వారికీ పథకాల ను అందిచడం నా ఉద్దేశ్యంగా గతం లోను పని చేశా రాబోయే కాలం లో కూడా అదేవిదంగా పని చేస్తానన్నారు.  అభివృద్ధి చేశాను మీరందరు ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు మీ విలువైన ఓటును వేసి మరొక సారి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి లో మరింత ముందుకు తీసుకుని పోతానని ప్రజలకు హామీ ఇచ్చారు

గడిచిన 5 ఏండ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు ప్రజల కండ్ల ముందు.. ఉపాధి హామీ చట్టం కింద 347 కుటుంబాలకు వంద రోజుల పని కల్పించడం జరిగింది. నిరుపేదలను గుర్తించి.. వారికి ఉన్న సొంత స్థలాల్లో రూ 12 కోట్ల 74 లక్షల 40 వేలతో 236 మందికి గత ప్రభుత్వ హయాంలో రెండు పడకల గదుల నిర్మాణాన్ని చేపట్టారు. గ్రామంలో 46 మహిళా సంఘాలు ఉండగా, 545 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వారు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేశారు పేద కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులకు జిల్లా కేంద్రం లోని ప్రగతి ఐటీ కళాశాలలో ఉచితంగా ట్రైనింగ్ ఇప్పించారు. ఆసరా, వితంతువు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఆసరా పింఛన్లు అందేలా చేయడం జరిగింది గ్రామం లోని ప్రతి వార్డు లో సీసి రోడ్లు వేయించడం జరిగింది.

గ్రామ అభివృద్దే ఎజెండా: సర్పంచ్ అభ్యర్థి పద్మశ్రీ బాలీశ్వర్ రెడ్డి 

గ్రామంలో గల ప్రజల కోసం గ్రంధాలయం ఏర్పాటు కు కృషి చేస్తా. గ్రామం లో మిగిలి పోయిన వార్డులో సిసి రోడ్ల నిర్మాణం, అవసరమైన చోట డ్రైనేజి నిర్మాణం చేపడుతాం. ప్రధానంగా ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వస్తే మండల కేంద్రానికి వెళ్ళాలిసిన అవసరం ఉందని ఈ నేపథ్యంలో గ్రామం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తా.  మండల కేంద్రం గా ఏర్పాటు కావడానికి అన్ని హంగులు కలిగిన సోలిపూర్ గ్రామాన్ని ప్రజల అందరి సహకారం తో మండల కేంద్ర ఏర్పాటు కు కృషి చేస్తా.