calender_icon.png 6 February, 2026 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఐతోనే అభివృద్ధి సాధ్యం

06-02-2026 12:09:12 AM

27 ఏళ్ల తర్వాత పాల్వంచకు ఎన్నికలు 

ఓట్లు అడిగే హక్కు సీపీఐకే ఉంది 

పాల్వంచ, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు తెచ్చిన ఘనత సిపిఐ పార్టీ దేనని, ఓట్లు అడిగే హక్కు ఆ పార్టీకే ఉందని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాల్వంచ డివిజన్ 47 వ వార్డు లో సిపిఐ పార్టీ నాయకులు, అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డ్ ఇంచార్జ్ రెహమాన్ మాట్లాడుతూ గత పాలకులు స్వార్థ రాజకీయాల కోసం పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించకుండా చేశారని ఆరోపించారు.

కొత్తగూడెం ఎమ్మెల్యేగా సాంబశివరావు ఎన్నికైన తరువాత పాల్వంచ మున్సిపల్ ఎన్నికలకు మార్గం అన్వేషించి కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలతోపాటు సుజాతనగర్ మండలంలోని కొన్ని పంచాయతీలను కలిపి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ గా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. దీంతో స్థానిక సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందన్నారు. త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో 47 వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుర్రం వెంకటేశ్వర్లను అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని పిలుపు నిచ్చారు.

పదవి కాదు సేవే ముఖ్యం: 36వ డివిజన్ అభ్యర్థి జిలాని బేగం 

స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు సేవలు అందించాలని ఉద్దేశంతోనే మున్సిపల్ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నట్లు 36వ డివిజన్ అభ్యర్థి జిలాని బేగం అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రలోభాలకు గురి కాకుండా సేవ చేసే అభ్యర్థులకు మద్దతిచ్చి ఆశీర్వదించాలని కోరారు. ఆమె వెంట డాక్టర్ మస్తాన్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.