నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు
25-06-2026 04:42 PM
మోతె, జూన్ 25 (విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు, డీఎస్పీ కోదాడ మరియు సిఐ మునగాల ఆధ్వర్యంలో మోతె పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాలపై ప్రత్యేక నిఘా మరియు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నకిలీ విత్తనాలు విక్రయించే డీలర్లు దుకాణదారులు మాత్రమే కాకుండా సంబంధిత కంపెనీలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు జిల్లాలో పట్టిష్ట నిఘా కొనసాగుతుందని అనుమానం ఉన్న సందర్భాల్లో డీలర్ల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.






