25 April, 2026 | 10:36 PM

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

10-05-2024 02:44 AM

రాజేంద్రనగర్, మే 9 : కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. బుధవారం ఆయన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని యాదవమిత్ర కాలనీలోప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన కార్యక్రమాలు, పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రెండు ఒకటేనని, ఎవరికి ఓటు వేసినా అది బీజేపీకే లబ్ధి చేకూరుతుందన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డిని ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.