బీజేపీకి ప్రజల నుంచి విశేష స్పందన
10-05-2024 02:46 AM
రాజేంద్రనగర్, మే 9 : ప్రధాని మోదీ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధితో పాటు దేశ భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నార ని బీజేపీ సీనియర్ నాయకులు శీలం తిరుపతిరెడ్డి అన్నారు. బీజేపీ పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన వివరించారు. గురువారం ఆయన బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. బీజేపీ పార్టీ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు జోగి రవి, సూరెడ్డి వినయ్‌రెడ్డి, తలారి చిన్న, వల్లూరి శ్రీనివాస్, చిన్న నందు, వినయ్, నాగేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.






