22 July, 2026 | 4:35 PM

Breaking News

హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ అభివృద్ధి: సీఎం రేవంత్‌రెడ్డి

29-06-2024 05:44 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరంగంల్ నగరం అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్షించారు. అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. వరంగల్ సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ 2050 రూపొందించాలన్నారు. హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేయాలన్నారు. హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు భూసేకరణ పూర్తి చేయాలని కోరారు. భూసేకరణను అవసరమైన నిధుల వివరాలు అందించాలన్నారు. హైవేలను అనుసంధానిస్తూ వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి టెక్స్ టైల్ పార్కును అనుసంధానించాలని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి చేయాలని తెలిపారు. నాలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపట్టాలని అధికారులన సీఎం ఆదేశించారు. వరంగల్ లో డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చేపాలన్నారు. వరంగల్ అభివృద్ధికి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.