11 July, 2026 | 8:33 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

సంక్షేమం అభివృద్ధి జోడెడ్లుగా సాగాలి

10-06-2024 01:50 AM
  • అధికారుల పనితీరుపై నెలనెలా నివేదికలు

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 

ఖమ్మం, జూన్ 9 (విజయక్రాంతి): సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లలా సాగాలని, నేటి నుంచి పాలన పరుగులు పెట్టించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా మధిరలో అధికారులతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజాపాలన అందించాలంటే అధికారులు చిత్తశుద్ధితో ప నిచేయాలని కోరారు. అధికారుల పనితీరు ను బట్టి బదిలీలు ఉంటాయని చెప్పారు. సిబ్బంది పనితీరును సమీక్షిస్తూ నెలనెలా నివేదికలు తెప్పించుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మూడేళ్లకు పైగా ఒకే చోట పాతుకుపోయిన ఉద్యోగులకు స్థానచలనం కల్గించాలని ఆదేశాలు జారీచేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హుడైన ప్రతి లబ్ధిదారుడికి చేరవేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని ఉద్ఘాటిం చారు. మున్సిపల్, నీటిపారుదల, విద్యుత్తుశాఖ అధికారులతో వివిధ అభివృద్ధి పనుల పై సమీక్షించారు.  

12, 13 తేదీల్లో మరోసారి సమీక్ష 

ఈ నెల ౧౨న ఖమ్మంలో జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మరోసారి అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పురోగతి, వైరా రిజర్వాయర్‌కు సాగర్ కాల్వల అనుసంధానం, నాగార్జనసాగర్ ఎడమ కాలువ నిర్వహణ పనులపై సమీక్షించనున్నారు.