10 July, 2026 | 6:26 PM

జేఈఈ ఫలితాల్లో కాకతీయ విద్యాసంస్థల ప్రభంజనం

10-06-2024 02:05 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 9 (విజయక్రాంతి): జేఈఈ ఆడ్వాన్డ్స్ పరీక్షా ఫలి తాల్లో నిజామాబాద్ కాకతీయ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఆదివారం విడుదల చేసిన 2024 జేఈఈ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా కాకతీయ విద్యాసంస్థలో 2024 ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని, తొలి ప్రయత్నంలోనే జేఈఈ అడ్వాన్డ్స్ ఫలితాల్లో కాకతీయ విద్యార్థులు మిన్హాజ్ 438 ర్యాంకు, ఏ తేజశ్విని 856, సుప్రీత్ 3,407, కేతన 3,740 ర్యాంకు, సిద్ధార్థ 4,906, హడి 5,102 ర్యాంకు..

ఇలా  90 శాతం పైనా 17 మంది కాకతీయ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని, ఇదంతా కాకతీయ విద్యాసంస్థ డైరెక్టర్లు, అధ్యాపకుల కృషితోనే సాధ్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ సీహెచ్ రామోజీరావు (ఐఐటీయన్) మాట్లాడుతూ.. ఈ సంవత్స రం ప్రకటించిన 2024 జేఈఈ మెయిన్స్, ఐఐటీ అడ్వాన్డ్స్ జాతీయ పరీక్షా ఫలితాల్లో వివిధ క్యాటగిరీల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి, తమ విద్యార్థులు నిజామాబాద్ స్థాయిలోనే కాకుండా జాతీయస్థాయిలో కూడా సత్తా చాటారని పేర్కొన్నారు.