20-02-2026 01:43:33 AM
స్వచ్ఛందంగా రక్తదానం, అన్నదానం
సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలరింపు
ఘనంగా నగరంలో శోభయాత్ర
నిజామాబాద్, ఫిబ్రవరి19 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం. లక్ష్మణ్ శివాజీ రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా, తొలుత ఇందూరు నగర శివారులోని బోర్గాం బ్రిడ్జి వద్ద గల శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సామాజిక సేవలో భాగంగా డీసీబీ బ్యాంకు ఉద్యోగులు, సేవా సమితి సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రక్తదానం చేయగా, అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం వేళ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పిల్లలు ప్రదర్శించిన కర్ర సాము అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం బోర్గాం నుంచి పూలాంగ్ చౌరస్తా వరకు శివాజీ శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది.
అంతేకాకుండా జిల్లా అంతటా వాడవాడలా శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి, ఐక్యత చాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు స్రవంతి రెడ్డి, వైష్ణవి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు జగన్ మోహన్ గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, సేవా సమితి కార్యదర్శి కృష్ణ పాటిల్, నాయకులు ప్రణయ్, మేరు సంఘం కార్యదర్శి నరేందర్ మరియు సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రత జాతి గర్వంగా చెప్పుకునే దిరుడు శివాజీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): భారతదేశం గర్వంగా చెప్పుకునే ధీరుడు చత్రపతి శివాజీ మహారాజ్ అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి లో చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు ఇంటర్నేషనల్ హోటల్ వద్ద ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. చత్రపతి శివాజీ వీరత్వానికి ప్రతిక అని అన్నారు. యువతరానికి, భవిష్యత్ తరాలకు మార్గదర్శకుడుగా చత్రపతి శివాజీ వ్యవహరించారన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, బిజెపి కౌన్సిలర్లు కుంట లక్ష్మారెడ్డి, నరేందర్ రెడ్డి, మోటూరి శ్రీకాంత్, కైరా రాహుల్ గౌడ్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.