శాంతినగర్‌లో అభివృద్ధి పనులు ప్రారంభం
19-08-2026 12:00 AM
వరంగల్, ఆగస్టు 18(విజయక్రాంతి): గత 30 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోక డ్రైనేజీ రోడ్స్ లేని సెకండ్ బ్యాంక్ కాలనీ శాంతినగర్‌లో అభివృద్ధి పనులను కొండా దంపతుల ఆదేశం మేరకు మాజీ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి ప్రారంభించారు.మంగళవారం ఉదయం డ్రైనేజీ పనులను ప్రారంభించడం పట్ల కాలనీ అసోసియేషన్ సభ్యులు బొడ్ల రవీంద్రనాథ్, కేవీ గోపాల్ రావు, దయాకర్ రావు, సతీష్, నూక శ్రీనివాస్, తదితరులు కుమార స్వామికి కృతజ్ఞతలు తెలియజేశారు.






