19-01-2026 09:41:47 PM
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడవల్లి బాల్ రెడ్డి
కోదాడ: కోదాడ పట్టణానికి కాంగ్రెస్ పార్టీ పాలనలో రూ.472 కోట్ల అభివృద్ధి పనులను చూసి కొంతమంది అబద్ధాల రాజకీయాలకు దిగుతున్నారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడవల్లి బాల్ రెడ్డి ఘాటుగా విరుచుకుపడ్డారు. సోమవారం కోదాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
258 కోట్ల డ్రైనేజీతో పట్టణానికి శాశ్వత విముక్తి పట్టణ ప్రజలను దశాబ్దాలుగా వేధిస్తున్న పారిశుధ్య సమస్యలకు తెరదించేందుకు జీవో నంబర్ 23 ప్రకారం రూ.258 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు టెండర్లు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పనులు పూర్తయితే కోదాడ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందన్నారు. కోర్టు భవనం 60 శాతం, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి 50 శాతం పూర్తయ్యాయని, బాలాజీ నగర్–శ్రీరంగాపురం సెంటర్ల అభివృద్ధి కూడా 50 శాతం దాటిందన్నారు.
మున్సిపాలిటీ భవనం నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని, రాబోయే నెలల్లోనే పనులన్నీ పూర్తి చేసి చూపిస్తామని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు పనిచేశారు, ఎవరు మాటలకే పరిమితమయ్యారో ప్రజలు తేల్చి చెబుతారని అన్నారు. ఈ సమావేశంలో చందా నిర్మల, షేక్ ముస్తఫా, లిక్కి మోహన్రావు యాదవ్, కంబాల ప్రసాద్, గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పిడతల శ్రీను, కుడుముల లక్ష్మీనారాయణ, రవి నాయక్, కుడుముల రాంబాబు, మేకపోతుల సత్యనారాయణ గౌడ్, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.