calender_icon.png 19 January, 2026 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదిలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలి

19-01-2026 09:39:27 PM

* కొడపాక ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

* స్పీడప్ గా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జరగాలి

విజయక్రాంతి,పాపన్నపేట: పదవ తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని, ప్రతి ఒక్క విద్యార్థి పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని, విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సోమవారం మండల పరిధిలోని కొడపాక ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.

విద్యార్థులు ఏ సబ్జెక్టులలో వెనకబడి ఉన్నారో తెలుసుకొని వారి పై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులతో మాట్లాడుతూ.. సేలబస్ ఎంత వరకు అయింది? ఎలా చదువుతున్నారు? హాజరు ఎలా ఉంది ? అని అడిగారు. సోషల్ మీడియా కు దూరంగా ఉండి చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం కొడపాక గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.