17 June, 2026 | 3:20 AM

గ్రామాల్లో అభివృద్ధి పనులు గడువులోపు పూర్తి చేయాలి

17-06-2026 02:27 AM

అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్యా నాయక్

వనపర్తి టౌన్ జూన్ 16: వనపర్తి మండలంలోని నాగమ్మ తండా గ్రామ పంచాయతీని జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మంగళవారం సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మాణంలో ఉన్న గ్రామ పంచాయతీ భవనం, వీవో భవనాల పనులను పరిశీలించి నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఏఈ (పీఆర్) అధికారికి సూచించారు. పనుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

అనంతరం గ్రామ నర్సరీని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్, నర్సరీ నిర్వహణను మరింత మెరుగుపరచాలని సూచించారు. మొక్కల సంరక్షణ, వాటి పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఫీల్ ఆఫీసర్, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో నర్సరీల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ), ఎంపీడీఓ, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శి, ఏఈ (పీఆర్) తదితర అధికారులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్తో పాటు గ్రామస్తులు కూడా హాజరయ్యారు.