అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
పాఖాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సందర్శనలో పీసీసీఎఫ్ వినయ్‌కుమార్
మహబూబాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): రాష్ట్రం లో అడవుల సంరక్షణ, పర్యాటకాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టడంతో అటవీశాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు కొనసాగిస్తున్నారు. అటవీ శాఖ పీసీసీఎఫ్ వినయ్‌కుమార్ పాఖాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని శనివారం సందర్శించారు. సీసీఎఫ్ భీమానాయక్, డీఎఫ్‌వో విశాల్ బత్తుల, అనూజ్ అగర్వాల్‌తో కలి సి వరంగల్, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని పాఖాల బయోడైవర్సిటీ ప్రాంతం, భీమునిపాదం జలపాతం వద్ద జరుగుతున్న ఎకో టూరిజం అభివృద్ధి ప నులను పరిశీలించారు.
అభివృద్ధి, పర్యాటకుల వసతి సౌకర్యాల పనులను వేగవంతం చేయాలని అధికారుల కు సూచించారు. వన్యప్రాణుల ఆవాసాల రక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించిన పీసీసీఎఫ్, జీవవై విధ్యాన్ని కాపాడటంలో రాజీ పడకూడదని స్పష్టంచేశా రు. గూడూరు వన్యప్రాణి డివిజన్ పరిధిలోని పులిమడుగు, మడగూడ బేస్ క్యాంపులను సందర్శించి పీసీసీ ఎఫ్, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరును ప్రశంసించారు.




