ఇది ప్రజాస్వామ్య జయకేతనం
- ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీలు బీఆర్‌ఎస్ కైవసం హర్షణీయం
- కామ్రేడ్ల పోరాట పటిమ ఎంతో స్ఫూర్తిదాయకం
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- రెండు మున్సిపాలిటీలు బీఆర్‌ఎస్ కైవసం హర్షణీయం
హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠా లను బీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడం ఎంతో హర్షణీయమని, ఇది ప్రజాస్వామ్య జయకేతనమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికైనవారికి శనివారం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషిచేసిన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌కు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి అభినందనలు తెలియజేశారు. అడ్డదారుల్లో వీటిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నిరకాల ప్రలోభాలు పెట్టి నా, రకరకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా వేటికీ లొంగకుండా మొక్కవోని దీక్షతో ఒక్క తాటిపై నిలిచిన కౌన్సిలర్లకు సెల్యూట్‌చేశారు.
క్యాతనపల్లి మున్సిపా లిటీని కైవసం చేసుకునేందుకు మిత్రపక్షమైన సీపీఐ కామ్రేడ్లు అడుగడుగునా కనబరిచిన పోరాట పటిమ ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అణచివేతకు, బెదిరింపులకు, అవినీతి అక్రమాలకు, అప్రజాస్వామిక చర్యలకు తెలంగాణలో తావులే దని ఈ తీర్పు తేల్చిచెప్పిందని స్పష్టంచేశారు. రెండున్నరేళ్లలోనే పీకల్లోతు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్‌కు ప్రజా క్షేత్రంలో కౌంట్ డౌన్ మొదలైందని ఈ ఫలితాలు నలుదిశలా చాటి చెప్పాయని తెలిపారు.
అటు పంచాయతీ, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టించిన గులాబీ జెండా సైనికులను పార్టీ ఎప్ప టికీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ విజయాలు అందించిన స్ఫూర్తిని కొనసాగిద్దాం.. కోట్లాడి తెచ్చు కున్న తెలంగాణను అడుగడుగునా విధ్వం సం చేస్తున్న రేవంత్ సర్కారుకు బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు.




