28 July, 2026 | 1:21 AM

అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి

28-07-2026 12:24 AM

మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం, జూలై - 27(విజయక్రాంతి): నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను పర్యవేక్షణతో నాణ్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి వర్యులు తు మ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఖమ్మం న గర పాలక సంస్థ పరిధిలోని 43వ డివిజన్లో రూ.61.50 లక్షల సుడా నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ పను లకు మంత్రి వర్యులు సోమవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మ ల నాగేశ్వర రావు మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగ పడే ప్రతి అభివృద్ధి పనిని నాణ్యతతో చేపట్టి పదికాలాల పాటు మన్నికగా ఉండే విధంగా పూర్తి చేయాలని అధికారుల కు సూచించారు. పనుల అమలులో నాణ్య త విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడద ని, ప్రభుత్వ నిధులను పారదర్శకంగా వినియోగించాలని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక ప్రజలు కూడా నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే పనులు మరింత నాణ్యతగా పూర్తవుతాయని మంత్రి పేర్కొన్నారు.

ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ఖమ్మం నగర అభివృద్ధికి వందల కోట్ల రూపాయలను విడుద ల చేస్తూ ప్రజలకు అవసరమైన మౌళిక స దుపాయాలను కల్పిస్తోందన్నారు. నగరం లో విశాలమైన రహదారులు, మెరుగైన మౌ ళిక సదుపాయాలు కల్పించడం ద్వారా అభివృద్ధి మరింత వేగవంతమవుతుందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.