ఫ్యామిలీ రిజిస్టర్ ఏర్పాటు హర్షణీయం
టీఎన్జీఓస్ సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హుస్సేనీ
హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ రిజిస్టర్ ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరమైన నిర్ణయమని టీఎన్జీఓస్ సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.ం హుస్సేనీ (ముజీబ్) పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు ఒకే ధ్రువీకృత రికార్డులో అందుబాటులో ఉండటంతో ప్రభుత్వ సేవ లు పొందడంలో పారదర్శకత, సులభతరం, సమయపాలన పెరుగుతాయని తెలిపారు.
ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు వివిధ శాఖ ల్లో కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, వారసత్వ సంబంధిత వివరాలు, ఇతర అధికారిక అవసరాల కోసం ఒకే ధ్రువీకృత పత్రాన్ని విని యోగించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. అలాగే సాధారణ ప్రజలకు కూడా కుటుంబ సభ్యుల వివరాల కోసం పలుమార్లు వివిధ ధ్రువపత్రాలు సమర్పించాల్సిన అవసరం తగ్గి, మీ సేవ కేంద్రాల ద్వారా త్వరితగతిన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ పొందే అవకాశం కలుగుతుందని తెలి పారు. ఈ ప్రజాహిత నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రికి టీఎన్జీఓస్ సెంట్రల్ యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.






