28 July, 2026 | 2:05 AM

ఐఐటీ, నీట్‌లో విద్యార్థులు రాణించాలి

28-07-2026 01:19 AM

మహేశ్వరం, జూలై 27 (విజయక్రాంతి): విద్యార్థులు జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని, ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించేలా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీస్ ) శ్రీ సంజయ్ జాజు సూచించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మహే శ్వరం మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ను ఆయన ఆకస్మికంగా సందర్శించా రు. పాఠశాలకు వచ్చిన సీఎస్కు విద్యార్థులు, ఉపాధ్యాయులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించిన సీఎస్, బోధనా విధానంపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. దాదాపు నలభై ఏళ్ల క్రితం తన పాఠశాలకు వచ్చిన ఒక ఐఏఎస్ అధికారిని చూసి ప్రేరణ పొంది తాను ఐఏఎస్ అయ్యానని, ప్రణాళికాబద్ధంగా చదివితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఆత్మవిశ్వాసం నింపారు.

ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ ఆన్లైన్ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులను ఆ దిశగా తీర్చిదిద్దే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవా లని పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాల హెచ్‌ఎమ్ శ్రీ ఈ. గోపితో సమావేశమై పాఠశాల సమస్యలు, అవసరాలను తెలుసుకు న్నారు. పాఠశాలలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదే శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సీఎస్ మొక్క నాటారు. ఈ కార్యక్ర మంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ కృష్ణ ఆదిత్య (ఐఏఎస్ ), శ్రీ శశాంక్ (ఐఏఎస్ ), జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీఓ, ఎంఆర్‌ఓ, ఎంపీడీఓ తదితర అధికారులు పాల్గొన్నారు. సీఎస్ సందర్శన పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.