27 March, 2026 | 3:21 AM

అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి..

08-02-2025 07:23 PM

బాగ్లింగంపల్లిలో రూ.15.60 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం..

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం బాగ్లింగంపల్లిలో రూ.15.60 లక్షల వ్యయంతో శివరేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులను ఆయన రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ రవి చారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ.. ముషీరాబాద్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో డ్రైనేజీ తాగునీటి పైపుల నిర్మాణ పనులను చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించినట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగానే బాగ్లింగంపల్లిలో నూతన నూతన డ్రైనేజీ నిర్మాణం పనులను శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అభివృద్ధి నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరిగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, ముదిగొండ మురళి, ముచ్చకుర్తి ప్రభాకర్, బీజేపీ నాయకుడు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.