27 March, 2026 | 2:02 AM

నిర్లక్ష్యానికి నిలువుటద్దం.. పంచాయతీరాజ్ రహదారులు!

27-03-2026 12:09 AM

మరమ్మతుల పేరుతో నిధులు దుర్వినియోగం?

మరికల్ - మహమ్మదాబాద్ రోడ్డుపై ప్రయాణికుల నరకయాతన

నవాబ్ పేట, మార్చి 26: మండల పరిధిలోని పంచాయతీరాజ్ రహదారుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ’మరమ్మతులు చేస్తున్నాం’ అని కాంట్రాక్టర్లు చెబుతు న్నా క్షేత్రస్థాయిలో మాత్రం గుంతలు పూడటం లేదు. కనీసం రోడ్డుకు అడ్డంగా ఉన్న పిచ్చిమొక్కలను తొలగించడం లేదు. పాలకుల పర్యవేక్షణ లోపం, అధికారుల ఉదాసీనత వెరసి సామాన్య ప్రయాణికులకు శాపంగా మారింది. నవాబుపేట మండలంలోని మరికల్ గ్రామం నుండి మహమ్మదాబాద్ మం డల కేంద్రానికి వెళ్లే పంచాయతీరాజ్ బీటీ రోడ్డు పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది.

సుమారు 14 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారిపై ఏళ్ల తరబడి గుంతలు ఏర్పడి అడ్డంకిగా మారాయి. ఇటీవల వార్షి క నిర్వహణ పనుల పేరుతో లక్షలాది రూపాయల నిధులు మంజూరైనప్పటికీ, పనులు మాత్రం నామమాత్రంగానే సాగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డుపై ఉన్న గుంతలను శాశ్వతంగా పూడ్చకుండా, కేవలం మట్టి పోసి చేతులు దులుపుకుంటున్నారని ప్ర యాణికులు మండిపడుతున్నారు.రోడ్డుకు ఇ రువైపులా పెరిగిన పిచ్చిమొక్కలు, 

చెట్ల కొమ్మలను తొలగించకపోవడంతో మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి.పారదర్శకత లేని పనుల వల్ల ప్రభుత్వ నిధులు పక్కదారి పడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- ఈ రోడ్లు నిర్లక్ష్యానికి నిలువుటద్దం...

నిర్వహణ పనుల పేరుతో కాలయాపన చేస్తున్న కాంట్రాక్టర్లపై పర్యవేక్షణ చేయని సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని స్థానికులు డిమాం డ్ చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి రహదారికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి ప్రయాణ కష్టాలను తీర్చాలని కోరుతున్నారు. నామమాత్రంగా చర్యలు తీసుకొని బిల్లులు చేసుకుని ఆ తర్వాత పర్యవేక్షణ మరిచి తక్కువ సమయంలోనే గుంతలుగా మారుతున్న సంబంధిత అధికార యంత్రం గా మాత్రం అసలు పట్టించుకోవడం లేదని విమర్శలు రూపొందుకుంటున్నాయి. స్ప ష్టంగా పంచాయతీ రహదారులకు సంబంధిత అధికార యంత్రంగం నిర్లక్ష్య కారణం గానే నామమాత్రపు చర్యలు తీసుకొని అంత పని చేసినట్టు చూపిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

నామమాత్రపు చర్యలతో ఉపయోగం ఏముంది 

 మరికల్ నుంచి మహమ్మదాబాద్ వెళ్లే రోడ్డు చాలా కాలంగా అధ్వాన్నంగా ఉం ది. ఇప్పుడు చేస్తున్న వార్షిక మరమ్మతులు కేవలం కంటితుడుపు చర్యగా మాత్రమే కనిపిస్తున్నాయి. గుంతల్లో నా ణ్యమైన మెటీరియల్ వాడకుండా కేవ లం మట్టి, కంకర పోసి వదిలేస్తున్నారు. వర్షం పడితే మళ్లీ పాత పరిస్థితే వస్తుం ది. కాంట్రాక్టర్లు లాభాల కోసం చూస్తున్నారే తప్ప, ప్రజల సౌకర్యాన్ని పట్టించు కోవడం లేదు. 

పండుగ కృష్ణవేణి, సర్పంచ్ కన్మన్ కాల్వ గ్రామం