జనాభా మాది.. అధికారం మీదా?
- తెలుగు రాష్ట్రాల్లో రజకులకు రాజకీయంగా తీవ్ర అన్యాయం
- బడుగులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కినప్పుడే సమస్యల పరిష్కారం
- బహుజనుల గొంతుక అయిన ‘విజయక్రాంతి’ని ఆదరించాలి
- రాష్ట్ర రజక ప్రజాప్రతినిధుల సమ్మేళనంలో ఏఐబీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ పూర్ణచంద్రరావు
* జనాభా దామాషా ప్రకారం బడు గు, బలహీనవర్గాలకు చట్టసభల్లో సముచితస్థానం దక్కినప్పుడే వారి దశాబ్దాల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన 42% బీసీ రిజర్వేషన్ల హామీని అమలు చేయలేదు. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్లను గతంలో కేసీఆర్ ప్రభుత్వం రాత్రికి రాత్రే అమలు చేసింది.
ఏఐబీఎస్పీ జాతీయ
కోఆర్డినేటర్ డా.పూర్ణచంద్రరావు

హైదరాబాద్, సిటీబ్యూరో మార్చి 26 (విజయక్రాంతి): ఓట్లు బీసీలవే, సీట్లు బీసీలవే.. అధికారం బీసీలదే కావాలి అన్న బహుజన నాయకుడు కాన్షీ రాం నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని రజకులు, బ హుజనులు ఐక్యంగా రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు వేయాలని ఏఐబీఎస్పీ ఆల్ ఇం డియా కోఆర్డినేటర్ డాక్టర్ జే పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. జనాభా దామాషా ప్రకారం బడు గు, బలహీనవర్గాలకు ఎప్పుడైతే చట్టసభల్లో సముచితస్థానం దక్కుతుందో, అప్పుడే వారి దశాబ్దాల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయ న స్పష్టంచేశారు.
గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర రజక సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్ల సమ్మేళనం అత్యంత కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా హాజరైన పూర్ణచంద్రరావు మాట్లాడు తూ.. తెలుగు రాష్ట్రాల్లో రజకులకు, బహుజనులకు జరుగుతున్న రాజకీయ, సామాజిక అన్యాయాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర జనాభాలో రజకులు రెండు శాతానికి పైగా ఉన్నప్పటికీ, చట్టసభ ల్లో వారి ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉందన్నారు.
ఈ విషయంలో రాజకీయ పార్టీలు చూపు తున్న పక్షపాత వైఖరిని లెక్కలతో సహా ఆయన వివరించారు. కమ్మ సామాజిక వర్గం జనాభా క న్నా రజకులు మూడు రెట్లు ఎక్కువ ఉన్నారని, అయినప్పటికీ నలుగురు కమ్మ ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఒకరికి మంత్రి పదవి దక్కిందని గుర్తుచేశారు. అలాగే, వెలమల కన్నా రజకులు 8 రెట్లు ఎక్కువ జనాభా కలిగి ఉంటే.. ఏకంగా 13 మంది వెలమ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టారని, అందులోనూ ఒకరికి మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు.
ఇక రెడ్ల వర్గం నుంచి ఏకంగా 43 మంది ఎమ్మెల్యేలు, ఒక ముఖ్యమంత్రి, పలువురు మం త్రులు ఉన్నారని ఆయన లెక్కలు చెప్పారు. కానీ, జనాభా పరం గా అత్యంత బలమైన రజక సామాజికవర్గానికి ఉన్న ఏకైక ఎమ్మెల్యేకు కనీసం మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ఆయన సూటిగా నిలదీశారు. ఇది కేవలం యాదృచ్ఛికం కాద ని, బీసీల ను ఉద్దేశపూర్వకంగా రాజ్యాధికారానికి దూరం చేసేందుకు రెడ్డి, కమ్మ, వెలమ కులాల నాయకులు చేస్తు న్న కుట్రగా ఆయన అభివర్ణించారు.
రాజకీయంగానే కాకుండా సామాజికంగా కూడా రజకు లకు రక్షణ కరువైందని పూ ర్ణచంద్రరావు మండిపడ్డారు. కొమ్మెర గ్రామంలో ఓ సర్పంచ్ అహం కారం కారణం గా రజక కుటుంబానికి చెందిన పసికందు ప్రాణాలు కోల్పోతే.. ఆ రెడ్డి సర్పంచ్‌పై నేటి కీ ప్రభుత్వం గానీ, అధికారులు గానీ కఠిన చర్యలు తీసుకోలేదని, దీన్ని బట్టి బడుగులకు రక్షణ ఎంత లోపించిందో అర్థం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తంచేశారు.
కనీసం ఆ బాధి త కుటుంబం తరఫున పోరాడేందుకు ఉన్న ఒక్క రజక ఎమ్మెల్యే కూడా ముందుకురాకపోవడం బహుజన సమాజానికి సిగ్గుచేటన్నారు. ఇక రాజకీయ హామీల అమలులోనూ ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నా యని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల హామీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమలుచేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ కింద 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రంలో ని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించిన వెంటనే, రాష్ట్రంలో నాటి కేసీఆర్ ప్రభుత్వం రాత్రికి రాత్రే అమలు చేసిందని.. కానీ బీసీల రిజర్వేషన్ల పెంపు పట్ల మాత్రం వీరెందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. బీసీలు ఐక్యంగా ఒకేతాటిపైకి రాకుం డా యాదవ్, గౌడ్, ఇతర బీసీ కులాల మధ్య ఆధిపత్య వర్గాల రాజకీయ నాయకులే చిచ్చుపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
పెరిగిన రజకుల ప్రాతినిధ్యం..
తెలంగాణ స్థానిక సంస్థల్లో రజకుల ప్రాతినిధ్యం పెరగడం కొంత ఊరటనిస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుతం 118 మంది సర్పంచులుగా, 200 మందికి పైగా ఉప సర్పంచులుగా, 2,200 మంది వార్డు సభ్యులుగా రజకులు గెలవడం సం తోషకరమన్నారు. అయితే రాబోయే రోజుల్లో ఈ సంఖ్య కనీసం రెట్టింపు కావాలని ఆకాంక్షించారు. సర్పంచులుగా ఉన్నవారు కేవలం గ్రామాలకే పరిమితం కాకుండా అసెంబ్లీ, లోక్‌సభ, రాజ్యసభ మె ట్లు ఎక్కేలా ఎదగాలని, అందుకు ఎస్సీ, ఎస్టీ, మైనా ర్టీ వర్గాలతో కలిసి ఐక్యంగా పనిచేయాలని, చట్టసభల సాక్షిగా మేమెంతో.. మాకంత అని నినదించాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సమ్మేళనంలో రజకు ల సంక్షేమం, హక్కుల సాధన కోసం పలు కీలక తీర్మానాలు చేసి ప్రభుత్వ ముందుఉంచారు. సా మాజికంగా, ఆర్థికంగా అత్యంత వెనుకబడిన రజకులను తక్షణమే ఎస్సీ జాబితాలో చేర్చాలని వా రు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దా డులను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని, జనాభా ప్రాతిపదికన బీసీలకు తెలంగాణలో 42 శాతం, ఆంధ్ర ప్రదేశ్లో 52 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించాలని కోరారు.
ఆధునిక డ్రైక్లీనింగ్ పరిశ్రమలో రజకులను ప్రభుత్వం భాగస్వాములను చేయాలని, జీవో 343 ప్రకారం రాష్ట్రంలోని చెరువుల వద్ద ఉన్న దోభీఖానా స్థలాలపై కేవలం రజకులకే పూర్తి హక్కులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. శారీరక శ్రమతో కూడిన వృత్తి కాబట్టి 50 ఏళ్లు దాటిన ప్రతి వృత్తిదారుడికి రజకులకు పెన్షన్ సదుపా యం కల్పించడంతో పాటు, ప్రభుత్వ రంగ సంస్థ ల్లో ఖాళీగా ఉన్న దోభీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
యాదగిరిగుట్ట, భ ద్రాచలం తదితర అన్ని ప్రధాన దేవాలయాల్లో డ్రై వాష్ కాంట్రాక్టులను టెండర్లతో సంబంధం లేకుం డా కేవలం రజకులకే కేటాయించేలా ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలని సదస్సు వేదికగా తీర్మానించారు. సమావేశం అనంతరం ఈ సమ్మేళనానికి విచ్చేసిన వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ టీ చిరంజీవులు, బీసీ సమాజ్ అధ్యక్షుడు సంగెం సూర్యారావు, సీనియర్ బీసీ నాయకులు విజయకుమార్, మనతొలివెలుగు టీవీ చీఫ్ రఘు, ఇటీవల ఎన్నికయిన రజక కులానికి చెందిన సుమారు 50 మంది సర్పంచులు, రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
అక్షరాయుధంగా ‘విజయక్రాంతి’
ఈ సందర్భంగా బహుజన, అణగారినవర్గాల గొంతుకగా నిలుస్తున్న ‘విజయక్రాంతి’ దినపత్రిక సేవలను డాక్టర్ పూర్ణచంద్రరావు వేదికపై ప్రత్యేకంగా ప్రశంసించారు. రాష్ట్రంలోని ప్రధాన స్రవంతి మీడియా బడుగు, బలహీనవర్గాల సమస్యలను, వారి రాజకీయ ఎదుగుదలను, వారిపై జరుగుతు న్న దాడులను ఉ ద్దేశపూర్వకంగా విస్మరిస్తున్న ప్ర స్తుత తరుణంలో.. ‘విజయ క్రాంతి’ పత్రిక నిస్వార్థంగా బహుజనుల పక్షాన నిలబడుతోందని ఆయన కొనియాడారు.
రజకులు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు ఎదుర్కొంటున్న సామాజిక దాడులు, వివక్షపై ఆ పత్రిక అక్షరాయుధమై రాజీలేని పోరాటం చేస్తోందని, అణగారినవర్గాలకు ఒక బలమైన వేదికగా మారిందని ఆయన పేర్కొన్నారు. బహుజన సమాజం తమ హక్కుల సాధన కోసం, తమ గొంతుకను సమాజానికి వినిపించడం కోసం తమ పక్షాన నిలబడే ‘విజయక్రాంతి’ లాంటి పత్రికలను గుండెల్లో పెట్టుకుని ఆదరించాలని, ప్రతిఒక్కరూ చదివి ప్రోత్సహించాలని ఆయన సభికులకు పిలుపునిచ్చారు.




