27 March, 2026 | 4:24 AM

ముగిసిన అంతర్జాతీయ మహిళా సదస్సు

27-03-2026 02:45 AM

సికింద్రాబాద్, మార్చ్26 (విజయక్రాంతి): ఉస్మానియా విశ్వవిద్యాలయ మూడు రోజుల అంతర్జాతీయ మహిళా సదస్సు (ఓయూఐడబ్ల్యూసీ 2026) ఘనం గా ముగిసింది. గివ్ టు గెయిన్: సుస్థిరత కోసం మహిళా శక్తి అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ సదస్సు ఠాగూర్ ఆడిటోరియం లో గురువారం నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సు మహిళా సాధికారత, సమానత్వం, నాయకత్వం, సాంకేతిక ఆవిష్కరణలు, సామాజిక మార్పులపై విశ్లేషణాత్మక చర్చలకు వేదికైంది.

దేశ విదేశాల నుంచి వచ్చిన మేధావులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. ముగింపు రోజున ఆర్థిక అక్షరాస్యత, మానసిక దృఢత్వం, సమ్మిళిత విద్యా వాతావ రణం, లింగ సున్నితత్వం, సాంస్కృతిక వారసత్వం వంటి అంశాలపై నిపుణులు విశ్లేషణా త్మక ప్రసంగాలు చేశారు. మహిళల సాధికారతకు ఆర్థిక స్వాతంత్య్రం, విద్య, సాంకేతిక పరిజ్ఞానం కీలకమని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన ముప్పు నాలుగు (34) మంది మహిళా మూర్తులను ఘనంగా సన్మానించారు.

ఈ ముగింపు వేడుకకు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మొలుగరం అధ్యక్షత వహించగా, సదస్సు కన్వీనర్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ సీనియర్ ప్రొఫెసర్ ఎం. విజ్జులత, ముఖ్య అతిథులుగా  జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతి సయా ని, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ ఉపకులపతి సీనియర్ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్, ఏలీప్ అధ్యక్షురాలు రమాదేవి కన్నెగంటి, డాక్టర్ కిరణ్మయి పెండ్యాల, డాక్టర్ సులీహా రసూల్, ప్రొఫెసర్ హమీదా బీ వందన, విజయ భారతి సయానిప్రొఫెసర్ సూర్య ధనంజయ్,ప్రొఫెసర్ సి. బీనా, సిద్ధార్థ దేవ్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.