calender_icon.png 22 August, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి

25-01-2025 12:51:45 AM

పంచాయతీరాజ్ ఇంజినీరింగ్  పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, జనవరి-24 (విజయక్రాంతి): పంచాయతీరాజ్ శాఖ పరిధిలో నూతనంగా మంజూరు చేసిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ పై జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష  సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా  కలెక్టర్   మాట్లాడుతూ  గ్రామీణ పంచాయతీ రాజ్ విభాగానికి సంబంధించి  పురోగతి ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి  ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అన్నారు. జిల్లాలోని హెల్త్ సెంటర్స్ మరమ్మత్తు పనులు, పాఠశాలల మరమ్మతు, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు,  రెసిడెన్షియల్ పాఠశాలల ,హస్టల్స్  మరమ్మత్తు పనులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఈ పనులకు సంబంధించి  అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని, వేగవంతంగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని  కలెక్టర్ ఆదేశించారు.

సమావేశంలో  ఈఈ పంచాయతీరాజ్ గిరీష్ బాబు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.