17 April, 2026 | 10:37 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

05-06-2025 06:27 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..

వనపర్తి టౌన్: వనపర్తి పట్టణంలో పెండింగ్ లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh ​​Surabhi) ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ తన చాంబర్ లో పట్టణంలోని పెండింగ్ అభివృద్ధి పనులపై మున్సిపల్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో కమిషన్ నిర్వహించారు. పట్టణంలో ఇప్పటికే నిధులు మంజూరై పనులు పెండింగ్ లో ఉన్న వాటిని త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లను ఆదేశించారు.

కళాభవన్, మినీ ట్యాంక్ బండ్, అమ్మ చెరువు, నల్లచెరువు అభివృద్ధి పనులను త్వరగా చేపట్టాలని సూచించారు. అదేవిధంగా పట్టణంలో చేపట్టాల్సిన డ్రైనేజీలు, చిట్యాల రోడ్డు, అప్పాయిపల్లి రోడ్డు తదితర పనుల పురోగతిపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరగా పూర్తిచేసి విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జ్ యాదయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పబ్లిక్ హెల్త్ డి ఈ శ్రీనివాస్, ఎ. ఈ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.