calender_icon.png 13 September, 2024 | 1:50 AM

ప్రతి శుక్రవారం ఒక అరగంట పరిసరాల పరిశుభ్రతకు కేటాయించండి

08-08-2024 03:01:55 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి (విజయంక్రాంతి ): వనపర్తి జిల్లాలో దోమల నివారణ కొరకు ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ప్రతి ఇంట్లో తమ పరిసరాల్లో నిలువ నీరు లేకుండా చూసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు. స్వచ్చదనం పచ్చదనం లో భాగంగా  గురువారం ఆరోగ్య సంరక్షణ దినోత్సవం గా పాటిస్తూ స్థానిక మహిళా సమాఖ్య భవనంలో మహిళా సమాఖ్య సభ్యులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం నుండి ప్రారంభమైన స్వచ్చదనం  పచ్చదనం కార్యక్రమం రేపు డ్రై డే వరకు నడుస్తుందన్నారు. నిలువ నీటిలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా కారకులైన దోమలు గుడ్లు పెట్టీ వ్యాప్తి చెందుతాయని వాటిని నివారించడానికి పరిసరాల్లో నిలువ నీరు లేకుండా చూసుకోవడం ఒక్కటే మార్గమని తెలిపారు. అందువల్ల ప్రతి శుక్రవారం ప్రతి ఒక్కరూ డ్రై డే లో భాగస్వాములై  నిలువ నీటిని శుభ్రం చేసుకునే విధంగ మహిళా సంఘాల సభ్యులు చొరవ తీసుకోవాలని కోరారు. 

అదేవిధంగా ప్రతి ఇంట్లో కనీసం ఒక మొక్క నాటి వాటిని సంరక్షించే విధంగా అవగాహన కల్పించాలి. తమ ఇళ్ళలో  సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకుండా అవగాహన కల్పించాలని, కూరగాయలకు ఎంటి నుంచి సంచి తీసుకువెళ్లడం, ప్లాస్టిక్ బాటిల్, గ్లాసులు వాడకపోవడం పై అవగాహన కల్పించాలన్నారు.  శ్రమదానం ద్వారా తమ కాలని, వార్డుల్లో ఉండే ప్రభుత్వ భవనాల పరిసరాల్లో చెత్త, పిచ్చి మొక్కలను  తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లాలో మహిళా సంఘాలకు విశేష ప్రాముఖ్యత ఉందనీ దాదాపు లక్షల మంది మహిళలు మహిళా సంఘాల్లో ఉంటారు. అందువల్ల మహిళా సమాఖ్య సభ్యులు ప్రతి మహిళ సంఘం సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పి సి. ఈ. ఒ యాదయ్య, పి.డి. డి.ఆర్డీఓ ఉమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి జయచంద్ర మోహన్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యమ్మ,  డా. సాయినాథ్ రెడ్డి, మండలం నుండి ముగ్గురు చొప్పున  మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.