25-05-2025 04:33:14 PM
సారంగాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) సారంగాపూర్ మండలంలోని అడెల్లి పోచమ్మ దైవ దర్శనానికై ఆదివారం తండోపా తండాలుగా భక్తులు తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుండే కాకుండా పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రాంతం నుండి కూడా వచ్చి భక్తులు కోనేరులో తల స్నానాలు ఆచరించి, నీలాలు సమర్పించి, ముడుపులు కట్టి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచ బోనాల నైవేధ్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరవ్వడంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపటి వరకు ఫోన్ సిగ్నల్స్ పని చేయలేదు. అయితే జన సంచార సమూహం అధికంగా ఉన్న చోట ఫోన్ సిగ్నల్స్ పని చేయవని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.