calender_icon.png 25 May, 2025 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాచార హక్కు చట్టం కమిషనర్ పీవీ శ్రీనివాస్ రావును ఘనంగా సన్మానించిన పొనిశెట్టి వెంకటేశ్వర్లు

25-05-2025 04:38:19 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ గా నియమితులైన పీవీ శ్రీనివాస్ రావు(PV Srinivas Rao) తొలిసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేసి, భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో పాల్వంచ దమ్మపేట సెంటర్ లో ఆయనను బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు(Ponisetti Venkateswarlu) సన్మానించారు. విద్యార్థి నాయకుడి నుండి అనేక ప్రముఖ టీవీ చానల్స్ పని చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ గా నియమితులు కావడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో చాల చురుకైన పాత్ర పోషించారని,రాజకీయాలకు అతీతంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు అనేక రకాల సహాయం చేసిన వ్యక్తి పీవీ శ్రీనివాస్ రావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుగులోత్ శంకర్, మాలోత్ ప్రశాంత్, మాదారపు లక్ష్మణ్, కాకటి సీతారాములు, రాంరెడ్డి, గుండు రాజు, భట్టు అశోక్, రేకల ప్రభాకర్, దొడ్డ రాంబాబు, కేసరి రవి, కిట్టు, వెంకటేష్, నరేందర్, రుద్ర, సన్నీ తదితరులు పాల్గొన్నారు.