5 August, 2026 | 10:05 PM

మెదక్ చర్చికి పోటెత్తిన భక్తులు

27-05-2024 12:28 AM

మెదక్, మే 26 (విజయక్రాంతి) : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవులు కావడంతో మెదక్ జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో చర్చి ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి పోయింది. చర్చి ఫాదర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులు సైతం తమ మొక్కులు తీర్చుకునేందుకు బారులు తీరారు.