5 August, 2026 | 11:02 PM

వ్యక్తిగత గొడవను రాజకీయం చేయొద్దు

27-05-2024 12:27 AM

పీసీసీ కార్యదర్శి సుప్రబాతరావు

రామాయంపేట(మెదక్), మే 26(విజయక్రాంతి) : ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదాన్ని రాజకీయం చేస్తూ రెండు పార్టీల మధ్య చిచ్చుపెట్టడానికి బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు, నాయకులు తిరుపతిరెడ్డి కుట్ర పన్నుతున్నారని రామాయంపేటకు చెందిన పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, బ్లాక్ కాం గ్రెస్ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ శనివారం రామాయంపేటలో గజవాడ నాగరాజుపై జరిగిన దాడిని తీవ్రం గా ఖండించారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకుడిపై పెట్రోల్ పోసి దాడి చేశారని వచ్చిన వార్తలో నిజం లేదన్నారు. నాగరాజు పిలిస్తేనే అందరూ వెళ్లారని, కాంగ్రెస్ నాయకులపై కూడా పెట్రోల్ పడిందని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడదని, రామాయంపేటలో అన్ని సమస్యల ను సృష్టిస్తుంది బీఆర్‌ఎస్ నాయకులేనని తెలిపారు. ఇద్దరి వ్యక్తిగత సమస్యను రాజకీయం చేయొద్దని, ప్రజలు గమనిస్తున్నారని సూచించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ గంగాధర్, సీనియర్ నాయకులు దోమకొండ యాదగిరి, బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి, మండల నాయకులు కుమార్‌సాగర్, రావెల్లి వినయ్‌సాగర్, విప్లవ్ కుమార్, చింతల రమేశ్, చిలుక విరాట్, సత్యనారాయణ పాల్గొన్నారు.