9 May, 2026 | 3:47 PM

శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా

09-05-2026 02:41 PM

హైదరాబాద్: శ్రీశైలంలో మరో సైబర్ మోసం వెలుగు చూసింది. నకిలీ వెబ్ సైట్(Fake Website) సృష్టించి ఢిల్లీ యాత్రికులను నేరగాళ్లు మోసం చేశారు. మల్లికార్జున సదన్ పేరుతో ఢిల్లీ యాత్రికులకు టోకరా ఇచ్చారు. ఢిల్లీ భక్తులు 9 ఏసీ గదుల కోసం రూ. 15 వేలు ఆన్ లైన్ లో చెల్లించారు. 27 మంది ఢిల్లీ వాసులు హైదరాబాద్ నుంచి పర్యాటక బస్సులో శ్రీశైలం(Srisaila Devasthanam) వెళ్లారు. మల్లికార్జున సదన్ లో గదుల కోసం సంప్రదించగా మోసం వెలుగులోకి వచ్చింది.  బాధితులకు దేవస్థానం తరుఫున ఉచిత వసతి ఏర్పాటుకు ఈవో చర్యలు తీసుకున్నారు.