31 August, 2026 | 1:10 AM

యాదగిరిగుట్టలో భక్తురాలి పర్సు చోరీ

31-08-2026 12:00 AM
  1. సీసీటీవీ ఆధారంగా పట్టుకున్న ఎస్పీఎఫ్ సిబ్బంది
  2. బాధితురాలికి పర్స్ అందజేత 

యాదగిరిగుట్ట, ఆగస్టు 30 : హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ తన కుమార్తెతో కలిసి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకు నేందుకు యాదగిరిగుట్టకు వచ్చా రు. కొండపైని బస్టాండ్ సమీపం లో గల సెల్ఫోన్ డిపాజిట్ కేంద్రం వద్ద ఆమె తన పర్సును(4200 రూపాయలు) పోగొట్టుకున్నారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా, కొండపై భక్తులకు బొట్టు పెట్టే వ్యక్తులు ఆ పర్సును తీసుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఎస్పీఎఫ్ సిబ్బంది బస్టాండ్ పరిసరాల్లో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి పర్సును స్వాధీనం చేసుకుని, సీఎస్‌ఓ చేతుల మీదుగా బాధితురాలికి అందజేశారు. పోగొట్టుకున్న పర్సు తిరిగి లభించడంతో ఆ భక్తురాలు హర్షం వ్యక్తం చేస్తూ, సత్వరమే స్పందించిన ఎస్పీఎఫ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.