కోదాడ అయ్యప్ప స్వామి దేవాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
కోదాడ, ఆగస్టు 30 :కోదాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ప్రముఖ డాక్టర్ జాస్తి సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. అయ్యప్ప స్వామి ఆలయం కమిటీ అధ్యక్షులు చల్లా రామమూర్తి, ప్రధాన కార్యదర్శి కొత్తూరు పూర్ణచంద్రరావు, కోశాధికారిగా ఏదులపురం శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు గా దంతాల నాగ య్య, సురభి నర్సయ్య, బొలిశెట్టి కృష్ణయ్య వంకాయలపాటి నాగేశ్వరరావు, నారగోని శంకర్, కందరబోయిన వీరస్వామి, మేడి బిక్షమయ్య, సహాయ కార్యదర్శులుగా గజ్జి సోమేశ్వరరావు,
పోలిశెట్టి నాగ నరసింహారావు, ఓరుగంటి నరసింహారావు, బాడిష సత్యం, యాద వెంకటేశ్వర్లు, ఐరాడి రాము, కార్యవర్గ సభ్యులు గా గద్దె మధు, కొత్తూరు శ్రీనివాసరావు, కంచుకొమ్ముల సైదులు, పైడిమర్రి హనుమంతరావు, పెనుగొండ వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.






