పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 27 (విజయక్రాంతి): వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలందించిన వారికి భారత ప్రభుత్వం ఏటా ప్రధానం చేసే పద్మ శ్రీ, పద్మభూషణ్ అవార్డుల కోసం హైదరాబాద్ జిల్లాలోని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాధికారి ఎన్.సుధాకర్‌రావు కోరా రు. కళలు, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్ అఫైర్స్, సైన్స్, టెక్నాలజీ, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, వైద్యం, లిటరేచర్, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్, తదితర రంగాల్లో సాధించిన ప్రతిభను తెలియజేస్తూ జిల్లాకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవాలని సోమవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మే 31 సాయంత్రం ఐదు గంటలలోపు లక్డీకాపూల్‌లోని హైదరాబాద్ కలెక్టరేట్‌లో గల స్నేహ సిల్వర్ జూబ్లి కాంప్లెక్స్ 3వ అంతస్తులో ఉన్న జిల్లా యువజన, క్రీడా అధికారి కార్యాలయంలో అభ్యర్థులు దరఖాస్తులను అందజేయాలని కోరారు. మరిన్ని వివరాలకు https://padmaa wards.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.






