భక్తి.. సన్మార్గంలో నడిపిస్తుంది
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, నవంబర్ 23(విజయక్రాంతి): నగరంలోని జగదాంబ కాలనీ లో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో డిసెంబర్ 5వ తేదీన నిర్వహించనున్న అయ్యప్ప స్వామి సామూహిక మహా పడిపూజ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
అయ్యప్ప స్వామి మహా పడిపూజ భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని, సన్మార్గాన్ని ప్రసాదించే మహోత్సవమని, ఇట్టి సామూహిక అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం సాధారణ భక్తులకు కల్పించడం గొప్ప అవకాశమని, కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డిసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, గురుస్వామి మెట్టుకాడి శ్యాంసుందర్, గురుస్వామి నగేష్ అయ్యప్ప స్వాములు వెంకటేష్, రాకేష్, రాహుల్, నాయకులు ఫయాజ్, సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తి సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
నగరం, వేంకటేశ్వర కాలనీలోని పుట్టపర్తి సాయిబాబా దేవాలయంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన పుట్టపర్తి సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయినాథుని దివ్య నామస్మరణతో మార్మోగిన భజన కార్యక్రమంలో ఆయన కాసేపు భక్తులతో కలిసి లీనమై, సాయిబాబా మహిమను స్మరించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ‘ప్రేమే నా మతం, సేవే నా ధర్మమని బోధించిన సాయిబాబా జీవితం మానవాళికి గొప్ప సందేశమన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తిరుమల వెంకటేష్, సాయి సేవా సమితి సభ్యులు మనోహర్ రెడ్డి, హన్మంతు రెడ్డి, రంగయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.






