23-11-2025 11:10:19 PM
సామాజిక తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆమనగంటి సైదులు..
ముషీరాబాద్ (విజయక్రాంతి): అనగనగారిన కులాల రాజ్యాధికారం కోసం, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఉచిత విద్య వైద్యం అందించాలని లక్ష్యంతో సామాజిక తెలంగాణ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆవిర్భావ సభలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆమన గంటి సైదులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సామాజిక తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆమనగంటి సైదులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మార్పులు తీసుకువచ్చే విధంగా అవినీతిని ఎండగడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా నిరంతరం సామాజిక తెలంగాణ పార్టీ కార్యకర్తలు పని చేస్తూనే ఉంటారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేస్తూ సామా-న్యుడి నడ్డి విడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్న సామాజిక తెలంగాణ పార్టీ ముందు వరుసలో ఉంటూ సమస్యలు పరిష్కరించే దిశగా పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ప్రకటిస్తూ వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మెట్టు శివ శంకర్, రాష్ట్ర యువజన అధ్యక్షులు సిహెచ్. రాజ్ కుమార్ గౌడ్, కే. బద్రి, ఓయూ జేఏసీ నాయకుడు సామాజిక రాజకీయ విశ్లేషకులు హరిత్ రూడా, గ్లోబల్ విశ్వకర్మ విశ్లేషకులు పి మధుసూదన్, బోయ హక్కుల పోరాట సమితి గోపి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.