27-10-2025 07:28:21 PM
సనత్‌నగర్ (విజయక్రాంతి): శ్రీ శబరి గిరీశ మహా పాదయాత్ర సమితి ఆధ్వర్యంలో మాలధారణ కార్యక్రమం ఈరోజు ఉదయం బోరబండ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గురుస్వామి సాయి కిరణ్ గౌడ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంలో కిషోర్ స్వామి, ఎలందర్ స్వామి, శివ స్వామి, వంశీ స్వామి, నాగరాజు స్వామి, నాని స్వామి, రామకృష్ణ స్వామి తదితర అయ్యప్ప భక్తులు పాల్గొని ప్రత్యేక పూజల్లో భాగమయ్యారు.