22 August, 2026 | 11:17 PM

డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తామంటూ.. డీజీపీ డీపీతో వాట్సప్ కాల్స్

22-05-2024 02:31 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే21(విజయక్రాంతి) :  “హలో నేను డీజీపీ రవిగుప్తా ఆఫీసు నుంచి మాట్లాడుతున్న. మాకు రూ.50వేలు ఇస్తే ఓకే. లేదంటే నిన్ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తాం.” తెలంగాణ డీజీపీ డీపీ ఫొటో ఉన్న ఫోన్ నెంబర్ నుంచి నగరంలోని ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురు కు వాట్సప్ కాల్ ద్వారా వచ్చిన బెదిరింపులు ఇవి. వెంటనే అప్రమత్తమైన సదరు వ్యాపార వేత్త కూతురు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాస్తవానికి ఈ ఫోన్ డీజీపీ ఆఫీసు నుంచి రాలేదు. పాకిస్థాన్ కోడ్ +92 గల నంబర్‌తో సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చిందని పోలీసులు గుర్తించారు. సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజు కూ శృతిమించుతున్నాయి. కొత్త కొత్త ఎత్తుగడలతో అమాయక ప్రజల నుంచి అందిన కాడికి దోచుకుంటుండగా, తాజాగా తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఫొటోను వాట్సప్ డీపీ ఫొటోగా పెట్టుకొని సైబర్ నేరాలకు పాల్పడటం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.