22 August, 2026 | 10:28 PM

డాక్టర్లే లేరు!

22-05-2024 02:32 AM

జిల్లా ఆస్పత్రిలో సేవలపై సీపీఎం ఆగ్రహం

వైద్యులు, ఇతర సిబ్బందిని నియమించాలని డిమాండ్

 యాదాద్రి భువనగిరి, మే 21( విజయక్రాంతి) : పెద్ద ఆస్పత్రి చెప్పుకోవడం తప్ప.. పేషెంట్లను చూసే డాక్టర్లే లేరని సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆస్పత్రిని సందర్శించిన ఆయన వైద్య సేవల తీరును పరిశీలించారు. దవాఖానలో అవసరమైన మేరకు డాక్టర్లు లేరని, సిబ్బంది కొరత కూడా ఉన్నట్లు తెలిపారు.  సరైన సిబ్బంది, సౌకర్యాలు లేకపోవడంతో గర్భిణీలు ఆస్పత్రికి రావడా నికి భయపడుతున్నారని పేర్కొన్నారు.  తక్షణమే 20 మంది వైద్యుల ను, ఇద్దరు ల్యాబ్ టెక్నిషియన్లను నియమించాలని డిమాండ్ చేశారు. 

చేయాలన్నారు. ఆసుపత్రిలో వైద్యం తీరుతో గర్భిణీలల్లో విశ్వాసం సన్నగిల్లుతుందన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం కల్పిం చాలని కోరారు. మాతా శిశు కేంద్రానికి ప్రతేక్య భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.  కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి పాండు, నాయకులు మాయ క్రిష్ణ, దయ్యాల నర్సింహ, గడ్డం వెంకటేష్, ముత్యాలు శివ ఓల్ధాస్, అంజయ్య పాల్గొన్నారు.