భార్య గొంతునులిమి చంపిన భర్త.. కారణం మాత్రం అదే
21-05-2024 11:03 AM
హైదరాబాద్: నగరంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ బ్యాంకు కాలనీలో ఓ భర్త ఘాతుకం బయటపడింది. అనుమానంతో భర్త రమేష్ భార్య కమల గొంతునులిమి హత్య చేశాడు. భార్యను హత్య చేసి అనంతరం రమేష్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. జనగామ జిల్లాకు చెందిన రమేష్, కమల కొన్నేళ్గుగా ఉప్పల్ లో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.






