27 August, 2026 | 4:41 AM

సీడ్ క్యాపిటల్‌లో రాష్ట్రానికి ఫస్ట్ ప్రైజ్

27-08-2026 02:40 AM
  1. మహిళా సాధికారత కోసం చేస్తున్న కృషికి జాతీయస్థాయి గుర్తింపు
  2. పీఎంఎఫ్‌ఎంఈ పథకాలు ఇందిరా మహిళా శక్తితో అనుసంధానం
  3. అధికారులను అభినందించిన మంత్రి సీతక్క

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాం తి): మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారిని స్వయం ఉపాధి నుంచి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభు త్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గు ర్తింపు లభించింది. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్(పీఎంఎఫ్‌ఎంఈ) పథకంలోని సీడ్ క్యాపిటల్ కాంపోనెంట్‌ను స్వయం సహాయ క సంఘాలకు సమర్థవంతంగా అందించడంలో తెలంగాణ రాష్ట్రానికి బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్  ఫస్ట్ రన్నరప్ అవార్డు లభించింది.

న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన పీఎంఎఫ్ ఎంఈ నేషనల్ కాన్‌క్లేవ్-2026లో కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ చేతుల మీదుగా తెలంగాణ తరఫున సెర్ప్ డైరెక్టర్ (ఫామ్) ఎన్. రజిత ఈ అవార్డును అందుకున్నారు.

ఈ జాతీయ అవార్డు మహిళా సంఘాలను కేవలం పొ దుపు, రుణాలకే పరిమితం చేయకుండా, వారికి మూలధనం అందించి ఉత్పత్తి, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ రంగాల్లో ఆర్థికంగా ఎదిగేలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానానికి దక్కిన గుర్తింపు అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు, సెర్ప్ అధికారులు, సిబ్బందికి ఆమె అభినందనలు తెలిపారు. ఈ అవార్డు అధికారులు, సిబ్బందికి గుర్తింపు అన్నారు.