ధర్మన్ రెండో షెడ్యూల్ షురూ
ఉలగనాయగన్ కమల్‌హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్య ఉన్నంత స్నేహబంధం చాలా అరుదు. భారతీయ చలనచిత్ర రంగంలో ఐదు దశాబ్దాలకుపైగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఈ ఇద్దరు దిగ్గజాలు, ‘ధర్మన్’ చిత్రం ద్వారా నిర్మాత-నటుడిగా తొలిసారి కలిసి పనిచేస్తున్నారు. రాజ్‌కమల్ ఫిలమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్‌హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రం, ‘ఆర్‌కేఎఫ్‌ఐ’ నిర్మాణంలో రజనీకాంత్ నటించే మొదటి సినిమా కావడం విశేషం.
అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ‘ది డెడ్లీ డాక్టర్’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపుదిద్దుకుంటోంది. ఇందులో సిమ్రాన్, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ రెండో షెడ్యూల్ ప్రారంచారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ టీమ్ విడుదల చేసిన ప్రత్యేక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్; సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మిరెడ్డి; యాక్షన్: అన్బరివ్; ఎడిటర్: ప్రదీప్ ఇ రాఘవ్; ఆర్ట్: అన్నదురై.






