ఒక జనరేషన్‌ను మార్చే హుషార్ పిట్టలు
అన్ష్, వాసవి గణేశన్ జంటగా రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘హుషార్ పిట్టలు’. రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రానికి భిక్షు దర్శకుడు. ఇందులో గోవర్ధన్, సునీత మనోహర్, రమేశ్, అంజి వల్గుమాన్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేశ్ ఫిలింస్ సంస్థలు ఆగస్టు 15న విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బెక్కెం వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో కథానాయకుడు అన్ష్ మాట్లాడుతూ.. “హుషార్ పిట్టలు’ సినిమాతో హిట్టు కొట్టబోతోన్నా అని తొడ గొట్టి చెబుతున్నా. చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద నాటకాలు వేస్తుండేవాడిని. కృష్ణా నగర్‌లో జరిగిన ఓ ఆడిషన్‌కు వెళ్తే.. అక్కడ కాఫీ కప్పులు తీయించారు. కానీ నా అభిమాన హీరో చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు కదిలా ను. ఆగస్టు 15న మా సినిమాను చూసి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా” అన్నారు. ‘ఈ సినిమా ప్రివ్యూ చూసి అందరూ ఎంజాయ్ చేస్తున్నా రు..
మా అమ్మమ్మ ఏజ్ ఉన్న వాళ్లు కూడా ఈ సినిమా చూస్తున్నారు.. ఇది ఒక జనరేషన్‌ను మార్చే సినిమా’ అని హీరోయిన్ వాసవి గణేశన్ తెలిపింది. నిర్మాత వెంకట్ యాదవ్ మాట్లాడుతూ.. “మేమంతా కష్టపడి సినిమాని తీశాం. ఒంటరిగా పోరాడుతున్నాం. తెలుగు వాళ్లందరం కలిసి చేసిన సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో కెమెరామెన్ రుద్ర సాయి, లిరిసిస్ట్ చిరంజన్, నటులు గోవర్దన్, చరణ్, భాను మాట్లాడారు.






