25 July, 2026 | 12:43 AM

కోదాడలో తొలిసారిగా శునకం చెవిలో స్కానింగ్

25-07-2026 12:10 AM

కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో మరో నూతన సౌకర్యం 

కోదాడ, జూలై 24 : కోదాడ పట్టణం ప్రాంతీయ పశువైద్యశాల లో శునకం చెవికి ఇయర్ పిక్ కెమెరా స్కానర్ తో తొలిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య శుక్రవారం స్కానింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతువుల చెవుల్లో ఇన్ఫెక్షన్, గడ్డలు ఇతర సమస్యలు ఉన్నప్పుడు లక్షణాలను బట్టి ఊహాజనితంగా చికిత్స చేయడం జరుగుతుంది అని కానీ చిన్న పెన్సిల్ లాంటి వైర్ లెస్ ఇయర్పిక్ కెమెరా స్కానర్ చివరలో అంతర్గతంగా అమర్చబడిన ప్రత్యేక చిన్న చిప్పు ద్వారా చెవిలోపలి భాగాలను  వై ఫై ద్వారా కనెక్ట్ చేయబడిన చరవాణి లో క్షుణ్ణంగా స్కానింగ్ చేయడానికి కావలసిన లోపలి భాగాల ఫోటోలు, వీడియోలు కూడా రికార్డ్ చేయవచ్చని, తద్వారా చెవి లోపల ఉన్న సమస్యను గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్సకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

ఒక పశు ఔషధ కంపెనీ వారు పశువైద్యశాలకు ఈ పరికరాన్ని ఇవ్వడం జరిగింది అన్నారు. కోదాడ పట్టణ పెంపుడు జంతు యజమాని ఒకరు చెవి సమస్యతో బాధపడుతున్న కుక్కను తీసుకురాగా ఈరోజు తొలిసారిగా ఈ స్కానర్ విజయవంతంగా ఉపయోగించడం జరిగింది అన్నారు. చికిత్సా కార్యక్రమములో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా సిరిపురపు సురేంద్ర, సిబ్బంది బడేటి శివ, కర్ణ, సాగర్ పాల్గొన్నారు