9 August, 2026 | 6:38 AM

డయాగ్నొస్టిక్ సెంటర్ సీజ్

26-05-2024 01:53 AM

మేడ్చల్, మే 25 : మేడ్చల్ జిల్లా పరిధిలోని డయాగ్నొస్టిక్ సెంటర్లలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు శనివా రం తనిఖీలు చేశారు. ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాల సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ధృవపత్రాలు లేకుండా నిర్వహిస్తున్న ధనుంజయ డయాగ్నొస్టిక్ సెంటర్‌ను సీజ్ చేశారు. అందులోని అల్ట్రా సౌండ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టీ రఘునాధస్వామి చెప్పారు. నిబంధనలు పాటించని డయాగ్నొస్టిక్ సెంటర్లపై ప్రీ కాన్షెప్షన్, ప్రీ డయాగ్నొస్టిక్ టెక్నిక్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డా.ఎన్.నారాయణరావు, డా.చం ద్రకళ, డా.సౌందర్యలత, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.